Razole: రాజోలులో కలకలం.. ఇద్దరు మైనర్ల అదృశ్యం!
రాజోలు: డాక్టర్ .బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.
9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయారు.
వీరిద్దరూ దూరపు బంధువులు. గతంలో ఒకే పాఠశాలలో కలిసి చదివిన వారు కాగా, ఒకే ప్రాంతానికి చెందినవారు కూడా కావడంతో ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇద్దరూ కలిసి వెళ్లి ఉండే అవకాశంతో పాటు ఇతర కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

