Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Red Zone: ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభం రాబోతుంది..!

Red Zone: ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభం రాబోతుంది..!

hmtv 2 days ago

Red Zone: ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభం రాబోతుంది..!

Global Oil Crisis : ప్రపంచవ్యాప్తంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ, సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకూ రాబోయే రోజుల్లో ఊహించని షాక్ తగలబోతోందా?

ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్ అత్యంత ప్రమాదకరమైన రెడ్ జోన్‌లోకి అడుగుపెట్టబోతోందా? అవుననే అంటోంది అంతర్జాతీయ ఇంధన సంస్థ. రాబోయే జులై లేదా ఆగస్టు నాటికి ప్రపంచం మునుపెన్నడూ చూడని ఇంధన సంక్షోభాన్ని చూడబోతోందని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికించేస్తోంది.

లండన్‌లో జరిగిన ప్రపంచ ఇంధన భద్రత ప్రత్యేక సదస్సులో ఫాతిహ్ బిరోల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు శరవేగంగా అడుగుంటుతున్నాయి. దీనికి తోడు.. రాబోయేది వేసవి కాలం . ఈ సీజన్‌లో టూరిజం, ట్రావెల్స్ భారీగా పెరుగుతాయి కాబట్టి.. ఆటోమేటిక్‌గా ఇంధనానికి డిమాండ్ మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంటుంది. ఒకవైపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే.. మరోవైపు సరఫరా మాత్రం పూర్తిగా పడిపోతోంది. ఈ రెండింటి కాంబినేషన్ ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టబోతోంది.

సంక్షోభానికి అసలు కారణం ఏంటి?

ఈ ముప్పు వెనుక ఉన్న అసలు కారణం.. పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇరాన్ చుట్టూ ముసురుకున్న యుద్ధ వాతావరణం. సంక్షోభం మొదలైన కొత్తలో చాలా దేశాల దగ్గర అవసరానికి మించి చమురు నిల్వలు ఉండేవి. కానీ, నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఆ నిల్వలన్నీ ఇప్పుడు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి ప్రస్తుతం ఉద్రిక్తతల నీడలో చిక్కుకుపోయింది.

పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచానికి చమురు సరఫరా సజావుగా సాగాలంటే.. హర్ముజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా, పూర్తిగా తిరిగి తెరవడమే ఏకైక మార్గం. ఒకవేళ ఇందులో విఫలమైతే, గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఒకవేళ హర్ముజ్ జలసంధి గనుక యథాతథంగా తెరుచుకోకపోతే.. రాబోయే జులై, ఆగస్టు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంధన హాహాకారాలు తప్పవు. చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది కేవలం పెట్రోల్, డీజిల్ ధరలకే పరిమితం కాదు.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu