Renigunta: రేణిగుంటలో మీడియా ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది మధ్య నిర్వహించనున్న స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలను రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ శాఖ మరియు మీడియా ప్రతినిధుల మధ్య సత్సంబంధాలు మరింత బలపడేలా ఈ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు పరస్పర అవగాహన, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ఈ స్నేహపూర్వక మ్యాచ్ ద్వారా పోలీస్-మీడియా మధ్య సమన్వయం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

