Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Renigunta: రేణిగుంట బస్టాండ్ వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్

Renigunta: రేణిగుంట బస్టాండ్ వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్

hmtv 3 days ago

Renigunta: రేణిగుంట బస్టాండ్ వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్

Renigunta: రేణిగుంట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైబర్ మోసాలు,గంజాయి ప్రమాదాలు,ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి, సిబ్బంది పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అపరిచిత లింకులు ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దని డీఎస్పీ సూచించారు.అదేవిదంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువతను కూడా వాటి బారిన పడకుండా చైతన్యపరచాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఆటో డ్రైవర్లు అధిక ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించవద్దని, రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu