Dailyhunt
RK Roja: రాజకీయాల వల్ల బీపీ, షుగర్ వచ్చాయి.. రోజా సంచలన వ్యాఖ్యలు!

RK Roja: రాజకీయాల వల్ల బీపీ, షుగర్ వచ్చాయి.. రోజా సంచలన వ్యాఖ్యలు!

hmtv 2 weeks ago

RK Roja: రాజకీయాల వల్ల బీపీ, షుగర్ వచ్చాయి.. రోజా సంచలన వ్యాఖ్యలు!

RK Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులు మరియు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నగరిలోని తన నివాసంలో పదవీకాలం ముగిసిన వైసీపీ సర్పంచ్‌లను సన్మానించిన సందర్భంగా ఆమె మనసు విప్పి మాట్లాడారు.

రాజకీయ ఒత్తిడి.. అనారోగ్య సమస్యలు

రాజకీయాలు అంటేనే అంతులేని మానసిక ఒత్తిడితో కూడుకున్నవని రోజా పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ.. "నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ సమస్య బారిన పడ్డాను. ఇక రెండోసారి గెలిచిన తర్వాత షుగర్ వచ్చింది" అని ఆమె వెల్లడించారు. ప్రజా సేవలో నిరంతరం ఒత్తిడికి లోనవ్వడం వల్లే ఈ ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు.

కూటమి నేతల్లా అబద్ధాలు చెప్పలేకపోయాం!

గత ఎన్నికల ఓటమిపై స్పందిస్తూ, తాము ప్రజలకు అబద్ధాలు చెప్పలేకపోయామని రోజా వ్యాఖ్యానించారు. "చంద్రబాబు కూటమి నేతల్లా మేం అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాం. అందుకే ఓటమి పాలయ్యాం. కానీ జగన్ పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాం" అని ఆమె స్పష్టం చేశారు. అబద్ధాలతో గెలిచిన వారికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

సర్పంచ్‌లకు పిలుపు.. స్థానిక సంస్థలే లక్ష్యం

వైసీపీ సర్పంచ్‌లు గర్వంగా ప్రజల్లోకి వెళ్లేలా తాము అభివృద్ధి పనులు చేశామని రోజా కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని, మళ్ళీ వైసీపీ విజయకేతనం ఎగురవేయాలని ఆమె కేడర్‌కు పిలుపునిచ్చారు. ప్రజాబలమే తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu