Sakinetipalli: లంక గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి వరద నీరు!
Sakinetipalli: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో సఖినేటిపల్లి, రాజోలు మండలాల పరిధిలోని పలు లంక, లోతట్టు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది.
సఖినేటిపల్లి-బాడిరేవు కాజ్‌వే పూర్తిగా నీట మునిగింది. అలాగే టేకిశెట్టిపాలెం-
అప్పనరామునిలంక కాజ్‌వే చుట్టూ వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది.
ఈరోజు సాయంత్రానికి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు.

