Sangam: సంగం ప్రభుత్వ ఐటీఐ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
సంగం: మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు సంస్థ ప్రిన్సిపాల్ పి.
విజయ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి, శిక్షణా సంస్థ డైరెక్టర్ ఆదేశాల మేరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సంగం ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుతం క్రింది కోర్సులు వివరాలు ఎలక్ట్రిషియన్.
40 సీట్లు, ఫిట్టర్ 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐటిఐ అడ్మిషన్స్.ఏపీ.జీవోవి. ఇన్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. దరఖాస్తులు 2026 మే 18 నుండి ప్రారంభమై జూన్ 30 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు, సందేహాల నివృత్తికై 9963950604,6300599477,9848148337 ఈ ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని ఐటీఐ యాజమాన్యం కోరింది.

