Sangam: సంగంలో చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత.. కేసు నమోదు చేసిన పోలీసులు!
నెల్లూరు జిల్లా: సంగం మండలంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీల సందర్భంగా వాహనంలో 16 డ్రమ్ములలో భారీ మొత్తంలో చికెన్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రజారోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉండటంతో, అధికారుల పర్యవేక్షణలో ఆ వ్యర్థాలను సమీప కొండ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.
అనంతరం అక్రమ రవాణాకు పాల్పడిన వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యర్థాలను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు.

