Dailyhunt
Sangareddy: బాణాపూర్‌లో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరణ

Sangareddy: బాణాపూర్‌లో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరణ

hmtv 1 week ago

Sangareddy: బాణాపూర్‌లో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరణ

సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ మండలం బాణాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో డిసిసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఛత్రపతి శివాజీ మహారాజును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. బాణాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండాను కర్ణాటక ఉత్తర ప్రాంత దుర్గా వాహిని సహా సమన్వయకర్త అనసూయ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడైన శివాజీ మహారాజును కొనియాడారు. అన్ని మతాలు, కులాలను గౌరవిస్తూ తన సైన్యంలో వారికి స్థానం కల్పించిన మహానాయకుడిగా ఆయనను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల అనిల్, ఉప సర్పంచ్ మేకల శంకర్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu