Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sangareddy: వట్‌పల్లి పీఎస్‌పై గ్రామస్తుల దాడి.. ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం!

Sangareddy: వట్‌పల్లి పీఎస్‌పై గ్రామస్తుల దాడి.. ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం!

hmtv 1 week ago

Sangareddy: వట్‌పల్లి పీఎస్‌పై గ్రామస్తుల దాడి.. ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.

వట్ పల్లి పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న 22 ఏళ్ల బీరప్ప అనే యువకుడు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించారు.

అయితే మృతుడి కుటుంబ సభ్యులకు కానీ, గ్రామస్తులకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందకు ఎలా దించుతారంటూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దాబా యజమానులు మరియు పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు వట్ పల్లి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన దరఖాస్తుపల్లి వాసులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనతో వట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిఐ అనిల్ కుమార్ అదనపు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బీరప్ప మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu