Santamaguluru: కలెక్టర్‌తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తో కలసి అందచేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్న రన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
అద్దంకి నియోజక వర్గ పరిధిలోని 5మండలాలకు చెందిన 84 మంది లబ్ధదారులకు 69 లక్షల 16 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసారు. అద్దంకి నియోజక వర్గ పరిధిలో ఈ రెండు సంవత్సరాల కాలంలో CMRF కింద మొత్తం 2,938 మంది లబ్ధిదారులకు మొత్తం 25 కోట్ల 31 లక్షల 79 వేల రూపాయలు అందజేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు .

