Secunderabad: ఎమ్మెల్యే ఏసీలో.. పిల్లలు ఎండలో.. అధికారులపై ఆదం సంతోష్ ఫైర్
Secunderabad: ఎమ్మెల్యే స్కూల్ కూల్చివెయించి తిరిగి పూనః నిర్మాణం చెయించకుండా ఆయన ఎసి లో కూర్చుంటే..
స్టూడేంట్స్ మాత్రం ఎండలో కూర్చోని చదువుకోవల్సిన పరిస్తితి సికింద్రాబాద్ లో ఉందని.. పట్టించుకోవలసిన అధికారులు ఇంక చోద్యం చుస్తున్నరంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు..సికింద్రాబాద్ జీహెచ్ ఎంసి కార్యలయంలో జోనల్ కమిషనర్ మంగతాయరు తో పాటు వివిధ విభాగల అదికారులతో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆదం సంతోష్ కుమార్ ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు.
డివిజన్ల వారిగా కార్పోరేటర్ కు పోటిలో ఉండే అభ్యర్ధులతో కలసి సమావేశం నిర్వహించగా. పలు సమస్యల విషయంలో అధికారులు సరిగా స్పందించడం లేదంటూ కాంగ్రెస్ నేతల మండిపడ్డారు. దీంతో సమావేశం కాసేపు వాడి వెడిగా సాగింది. అధికారులు పట్టించుకోక పోతే విషయం సీఏం వరకు తీసుకవెళుతమని.. బిఆర్ యస్ మాజీ కార్పోరేటర్లు, నాయకులు కబ్జాలు చెసిన, వసూళ్ళు చెస్తున్న పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నంటూ పలు ఫిర్యాదులు అందించగా.. తప్పకుండా తమ వంతుగా వెంటనే చర్యలు తీసుకుంటాం అంటూ జోనల్ కమిషనర్ మంగతాయరు హమి ఇచ్చారు.

