Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Secunderabad: సికింద్రాబాద్‌లో హిందూ ఐక్యత చాటిన సమ్మేళనం

Secunderabad: సికింద్రాబాద్‌లో హిందూ ఐక్యత చాటిన సమ్మేళనం

hmtv 2 weeks ago

Secunderabad: సికింద్రాబాద్‌లో హిందూ ఐక్యత చాటిన సమ్మేళనం

సికింద్రాబాద్: యావత్ భారతదేశం అంతట సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు.

ఎక్కడో మారుమూల గ్రామానికి కూడా హిందూ సమ్మేళనాలు కార్యక్రమాలు జరుపుతున్నందుకు ఆర్ఎస్ఎస్ వారి గొప్పతనం అని సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా వీరి ప్రయత్నంలో సాధువులను మేము భాగస్వాములమవుతామని శివ రుద్ర సాధువు ఆశాభావం వ్యక్తం చేశారు. మోట మార్కెట్ డివిజన్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివ రుద్ర సాధువు తోపాటు వక్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చిన్నారులు నాటే ప్రదర్శన మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో పంచముఖి హనుమాన్ దేవాలయం నుండి హిందూ సమ్మేళనానికి భక్తులు చిన్నారులతో ర్యాలీగా ఈ సమ్మేళ కార్యక్రమానికి వచ్చారు అనంతరం ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శనలో రామాయణ నాట్య ప్రదర్శనను చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శివ రుద్ర సాధువు మాట్లాడుతూ నేటి సమాజానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరమని ముఖ్యంగా యువతలో ఇలాంటి కార్యక్రమాలు బోధన చేయడం వల్ల వారు చెడు దారిన పట్టకుండా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళమవుతామని ఆయన అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu