Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shubman Gill : ఐపీఎల్ 2026 తర్వాత శుభ్‌మన్ గిల్ పెళ్లి? లైవ్ మ్యాచ్‌లో కెప్టెన్ రియాక్షన్ ఇదే!

Shubman Gill : ఐపీఎల్ 2026 తర్వాత శుభ్‌మన్ గిల్ పెళ్లి? లైవ్ మ్యాచ్‌లో కెప్టెన్ రియాక్షన్ ఇదే!

hmtv 2 weeks ago

Shubman Gill

Shubman Gill

Shubman Gill : టీమిండియా యువ సంచలనం, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆటతోనే కాదు, తన పర్సనల్ లైఫ్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు.

తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో గిల్ పెళ్లి గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. గ్రౌండ్‌లో టాస్ వేయడానికి వచ్చిన గిల్‌కు ఊహించని ప్రశ్న ఎదురవ్వడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వింత సంఘటన జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత గిల్ బ్రాడ్‌కాస్టర్ డ్యానీ మోరిసన్ వద్దకు వెళ్ళాడు. సాధారణంగా జట్టు కూర్పు గురించి మాట్లాడాల్సిన డ్యానీ, అకస్మాత్తుగా "గిల్, ఇంకా నీ పెళ్లి గంటలు మోగడం లేదు? మాకేమైనా హింట్ ఇస్తావా?" అని అడిగేశాడు. ఈ ప్రశ్నతో గిల్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. కాసేపు మౌనంగా ఉండి, చిన్న నవ్వు నవ్వి "లేదు.. ఏమీ లేదు" అని సింపుల్‌గా సమాధానం ఇచ్చి టాపిక్ డైవర్ట్ చేశాడు.

నిజానికి డ్యానీ మోరిసన్ గిల్‌ను ఇలా ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఐపీఎల్ 2025లో కూడా ఒక మ్యాచ్ సందర్భంగా గిల్ పెళ్లి గురించి డ్యానీ ఇలాగే పదే పదే అడిగాడు. అప్పట్లో కూడా గిల్ చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు. గిల్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గత మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని, ప్రస్తుతం తన దృష్టంతా క్రికెట్ కెరీర్ మీదే ఉందని స్పష్టం చేశాడు. ఎన్ని పుకార్లు వచ్చినా తను మాత్రం వాటిని పట్టించుకోనని గిల్ అప్పట్లో చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక కీలక మార్పు జరిగింది. స్టార్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకున్నారు. ఇది నిశాంత్ సింధుకు తొలి ఐపీఎల్ మ్యాచ్. 2022 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో నిశాంత్ కీలక సభ్యుడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ ఆడే అవకాశం రాలేదు. 2025లో గుజరాత్ జట్టులోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్, దేశీవాళీ క్రికెట్‌లో అదరగొట్టి ఇప్పుడు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చారు.

శుభ్‌మన్ గిల్ పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చినా, ప్రస్తుతానికి అతడు కేవలం గ్రౌండ్ లో పరుగులు చేయడం మీదే ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. డ్యానీ మోరిసన్ అడిగిన ప్రశ్నకు గిల్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క కెప్టెన్సీ భారం, మరోపక్క పెళ్లి గురించిన ప్రశ్నలు.. గిల్ మాత్రం వీటన్నింటినీ తనదైన శైలిలో కూల్‌గా హ్యాండిల్ చేస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu