Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shubman Gill History: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి కెప్టెన్‌గా ప్రిన్స్!

Shubman Gill History: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి కెప్టెన్‌గా ప్రిన్స్!

hmtv 1 week ago

Shubman Gill History: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా ప్రిన్స్!

Shubman Gill History: గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో టీమిండియా ప్రిన్స్ ఖాతాలో ఏ ఘనత చేరింది. క్వాలిఫయర్-2లో గిల్ కేవలం 53 బంతుల్లో 104 పరుగులు బాదాడు. ఈ రికార్డు మోస్ట్ సక్సెస్ ఫుల్ ఐపీఎల్ సారథులు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాకపోవడం విశేషం. భారీ ఒత్తిడి ఉన్న నాకౌట్ మ్యాచ్‌లో గిల్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభం అందించాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడిన ప్రిన్స్.. రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్ సెంచరీతో పాటు సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ (58) చేయడంతో గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ సెంచరీతో గిల్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ లేదా నాకౌట్ మ్యాచ్‌లలో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2023 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై 129 పరుగులు చేసిన గిల్.. ఇప్పుడు రాజస్థాన్‌పై మరో సెంచరీ బాది తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంతకుముందు ఏ బ్యాటర్ కూడా ప్లేఆఫ్స్‌లో రెండు సెంచరీలు నమోదు చేయలేదు.

ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ మరో రికార్డ్ అందుకున్నాడు. గిల్ 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఇదివరకు 49 బంతుల్లో శతకం చేశాడు. పాటిదార్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 15 మ్యాచ్‌ల్లో 722 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. అతడి సగటు 48.13 కాగా.. స్ట్రైక్‌రేట్ 163.72గా నమోదైంది. ఈ సీజన్‌లో ఒక సెంచరీతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన గిల్.. గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. బ్యాట్‌తో కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ శుభ్‌మన్ గిల్ తన నాయకత్వ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన గిల్.. ఫైనల్‌లో కూడా అదే జోరు కొనసాగించి జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ ఫామ్, ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. ఐపీఎల్ 2026 సీజన్‌ను గిల్ కెరీర్‌లో అత్యుత్తమ సీజన్‌లలో ఒకటిగా నిలవనుంది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ, జీటీ జట్లు ఐపీఎల్ 2026 ఫైనల్లో తలపడనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu