Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Siddipet: దళితులపై కుల వివక్ష.. తండ్రీకొడుకులపై కేసు నమోదు!

Siddipet: దళితులపై కుల వివక్ష.. తండ్రీకొడుకులపై కేసు నమోదు!

hmtv 1 week ago

Siddipet: దళితులపై కుల వివక్ష.. తండ్రీకొడుకులపై కేసు నమోదు!

అక్బర్ పేట - భూంపల్లి (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన గోప బాలరాజు, పేరెట్ల యాదగిరి, గోప రంజిత్ మరియు కుమ్మరి సత్తయ్య మూడు ఎడ్లబండ్లతో గ్రామ శివారులోని నస్కంటి పానాది నుండి వారి అవసరాల నిమిత్తం ఇసుక తీసుకురావడానికి మూడు ఎడ్ల బండి తీసుకొని అక్కడికి వెళ్ళినారు అక్కడ ఇసుక నింపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా సాయంత్రం అందాజా ఆరు గంటల సమయంలో బండి మురళి గౌడ్

పొలం వద్దకు రాగానే బండి మురళి మరియు అతని తండ్రి నర్సా గౌడ్ ఎడ్ల పండ్లను ఆపి మా జాగ నుండి ఎందుకు వస్తున్నారు అని కులం పేరుతో దూషించి నానా బూతు మాటలు తిట్టినారు..

ఇట్టి విషయంలో పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన గోప బాలరాజు ఫిర్యాదు మేరకు బండి మురళి గౌడ్ మరియు అతని తండ్రి బండి నర్సా గౌడ్ లపై కేసు నమోదు చేయనైనది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu