Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Siddipet: దుబ్బాక డీలర్లకు సిద్దిపేట ఆర్డీఓ సదానందం సీరియస్ వార్నింగ్!

Siddipet: దుబ్బాక డీలర్లకు సిద్దిపేట ఆర్డీఓ సదానందం సీరియస్ వార్నింగ్!

hmtv 1 week ago

Siddipet: దుబ్బాక డీలర్లకు సిద్దిపేట ఆర్డీఓ సదానందం సీరియస్ వార్నింగ్!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక డివిజన్ లోని ఎరువులు,విత్తనాల మరియు పురుగు మందుల డీలర్లకు,వచ్చే వానాకాలం సీజన్ గాను దుబ్బాక ఐ.

ఓ. సి కార్యాలయం లో సమావేశం నిర్వహించడం జరిగినది.ఇట్టి సమావేశానికి *సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ ఆధికారి సదానందం గారు హాజరై ఈ క్రింద సూచనలు, ఇవ్వడం జరిగినది.డీలర్లు సన్న రకం వరి రకాలను రైతులకు ప్రోత్సహించాలని కోరడం జరిగింది.ప్రభుత్వం సన్న రకాలకు అధిక ప్రోత్సాహ కంగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది కాబట్టి రైతులు ప్రభుత్వం చే సూచించబడిన సన్న రకాలు బిపిటి 5204, తెలంగాణ సోనా, హెచ్ఎంటి, జైశ్రీరామ్, KNM 1638,WGL 44,WGL 962,JGL 1798 వంటి సన్న రకాలను రైతులు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని డీలర్లను ఆదేశించడం అయినది. ఈ రకాలు సాగు చేయడం వలన మార్కెట్ డిమాండ్, మిల్లింగ్ క్వాలిటీ బాగా ఉండి అధిక రాబడి వస్తుంది కాబట్టి వీటిని తప్పకుండా ప్రోత్సహించాలి అని తెలపడం అయినది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu