Siddipet: దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. వైభవంగా సాగిన గృహప్రవేశాలు!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, ఈరోజు చీకోడు గ్రామంలో లబ్ధిదారుల నూతన గృహప్రవేశ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.గ్రామ సర్పంచ్ శ్రీ కొమిరే నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, లబ్ధిదారులు బొందన్నగారి పద్మ పర్షరాములు, సోనమైన ఉజ్వల రాజు తమ నూతన ఇందిరమ్మ ఇళ్లలోకి గృహప్రవేశం చేశారు.
ముఖ్య అతిథులుగ దుబ్బాక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగరం బాల్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో గ్రామ పాలక వర్గ వార్డ్ మెంబర్లు ఎండి షరీఫ్, కంకణాల రాజు, ఎండి సాదిక్.పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటం దేవరాజు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, దేవాదాయ కమిటీ సభ్యులు వెంకట చారి తదితరులు పాల్గొన్నారు.

