Dailyhunt
Siddipet: మిరుదొడ్డిలో కేబుల్ దొంగల బీభత్సం!

Siddipet: మిరుదొడ్డిలో కేబుల్ దొంగల బీభత్సం!

hmtv 4 days ago

Siddipet: మిరుదొడ్డిలో కేబుల్ దొంగల బీభత్సం!

Siddipet: అర్ధరాత్రి అన్నదాతల పొలాలే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం, ఆరెపల్లి గ్రామాల శివారులోని వ్యవసాయ పొలాల్లోకి చొరబడిన దొంగలు..

కేబుల్ వైర్లు, మోటార్లు, విద్యుత్ స్టార్టర్లను ఎత్తుకెళ్లారు.

ఈ దారుణ చోరీలో సుమారు 15 మంది రైతులు నష్టపోయారు. లక్షల రూపాయల విలువైన వ్యవసాయ సామాగ్రి ఒక్క రాత్రిలో మాయమైంది.గతంలో కూడా ఇలానే చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పుడు మళ్లీ అర్ధరాత్రి దొంగతనం జరగడంతో మేము తీవ్ర ఆందోళనలో ఉన్నాం" అంటూ రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

పంట చేతికొచ్చే సమయంలో మోటార్లు లేకపోతే పొలాలు ఎండిపోతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఎత్తుకెళ్లిన మోటార్లు, కేబుల్ వైర్లను తిరిగి ఇప్పించాలని రైతులు పోలీసులను వేడుకుంటున్నారు. మిరుదొడ్డి మండలంలో వరుస చోరీలతో అన్నదాతలు భయాందోళనలో ఉన్నారు. పోలీసులు స్పందించి నిందితులను పట్టుకుంటారా? రైతులకు న్యాయం చేస్తారా? వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu