Siddipet: వెంకట్రావుపేట్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
Siddipet: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామం లో అంబేద్కర్ సమతా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు.
తెలంగాణ తొలిదశ మలిదశ అమరవీరులను వారి త్యాగాలను స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. సమతా యూత్ అధ్యక్షుడు కల్లేపు భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానకార్యదర్శి కల్లేపు భాను చందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించి పోరాడు అనే విధానం లో సబ్బండ వర్గాలు, జాతులు ఉద్యమం లో పాల్గొనడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, కానీ దాని ప్రతిఫలాలు మాత్రం కొన్ని వర్గాలు, కొంత మంది కుటుంబ సభ్యులకు మాత్రమే అందాయని అన్నారు. బౌగోలిక తెలంగాణ ఏర్పడ్డది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని, అధికారం సంపదలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులను తెచ్చేందుకు ఇంకా పోరాడవలసి ఉందని, సామాజిక తెలంగాణ వస్తేనే బడుగు బలహీన వర్గాలకు సంపదలో, అధికారం లో వాట దక్కుతుందని అన్నారు.

