Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీసు డ్యూటీ మీట్-2026 ప్రారంభం
Sircilla: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్-2026 ఘనంగా ప్రారంభమైంది.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ చంద్రయ్య ప్రారంభించారు.
విధుల్లో మరింత సమర్థవంతంగా రాణించాలంటే పోలీసు అధికారులకు వృత్తి నైపుణ్యం అత్యంత అవసరమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. నేర దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ సాంకేతికతల వినియోగం, ప్రజా భద్రత పరిరక్షణ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి డ్యూటీ మీట్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని తెలిపారు.
ఈ డ్యూటీ మీట్‌లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ మరియు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.

