Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sircilla: సిరిసిల్ల ఓటరు సవరణ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి

Sircilla: సిరిసిల్ల ఓటరు సవరణ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి

hmtv 4 months ago

Sircilla: సిరిసిల్ల ఓటరు సవరణ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి

సిరిసిల్ల: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో కలిసి ఎస్‌ఐఆర్‌ పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తుది దశకు చేరుకుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్లు వివరాలు నమోదు చేసిన ఫారాలను సేకరించి, బీఎల్‌ఓ యాప్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ నెల 20వ తేదీలోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు.

అలాగే, ఓటర్లకు ఫారాలు నింపడంలో వాలంటీర్ల సహకారం అందించాలని, డిజిటలైజేషన్ అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం సమర్పించిన ఓటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.3 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బీఎల్‌ఓలకు శిక్షణ అందించామని, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu