Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sircilla: సిరిసిల్లలో ఆగస్టు 31 వరకు పోలీస్ యాక్ట్ అమలు SP

Sircilla: సిరిసిల్లలో ఆగస్టు 31 వరకు పోలీస్ యాక్ట్ అమలు SP

hmtv 3 weeks ago

Sircilla: సిరిసిల్లలో ఆగస్టు 31 వరకు పోలీస్ యాక్ట్ అమలు SP

సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.

గితే తెలిపారు.

ఈ మేరకు పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగం కూడా నిషేధమని పేర్కొన్నారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించిన ఎస్పీ, జిల్లా ప్రజలు పోలీసు శాఖకు సహకరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu