Sircilla: తంగళ్లపల్లిలో గంజాయి కలకలం డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి పోలీసులు
సిరిసిల్ల జిల్లా: జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం తంగాళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.ఐ (అడ్మిన్) ఆధ్వర్యంలో నార్కోటిక్ జాగిలం సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్‌లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, క్రయవిక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
డ్రగ్స్, గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొంటూ విద్యార్థులు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్: 8712671111కు సమాచారం ఇవ్వాలని కోరారు
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

