Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Siricilla: అమెరికా 'నాపా' కోసం 'వెండి వెన్నెల పూల చీర'!

Siricilla: అమెరికా 'నాపా' కోసం 'వెండి వెన్నెల పూల చీర'!

hmtv 1 hr ago

Siricilla: అమెరికా 'నాపా' కోసం 'వెండి వెన్నెల పూల చీర'!

Siricilla: చేనేత కళకు సరికొత్త సొబగులు అద్దుతూ సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు, చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మరో అద్భుతమైన చీరను రూపొందించారు.

తన తండ్రి, చేనేత కళాశిల్పి, అగ్గిపెట్టలో చీర సృష్టికర్త నల్ల పరంధాములు ఆశీర్వాదంతో చేనేత రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.

అమెరికాలో నిర్వహించనున్న నాపా ఈవెంట్ నిర్వాహకుల ఆర్డర్ మేరకు సరికొత్త డిజైన్‌లో చీరను రూపొందించాలని కోరడంతో, వారి ఆలోచనకు అనుగుణంగా 'వెండి వెన్నెల పూల చీర' ను తయారు చేసినట్లు చెప్పారు.

చంద్రుడి నిండైన వెన్నెల కాంతిని ప్రతిబింబించేలా చీర రంగును ఎంపిక చేసి, 108 వెండి పూలను ప్రత్యేక డిజైన్‌గా రూపొందించారు. మొగ్గంపై ఈ డిజైన్‌ను నేయడానికి సుమారు వారం రోజుల పాటు శ్రమించినట్లు విజయ్ కుమార్ తెలిపారు.

ఈ చీరలో పూర్తిగా వెండి జరీతో కూడిన పట్టుపోగులు ఉపయోగించడంతో పాటు చందమామను తలపించే వైట్, వెండి రంగులను వినియోగించారు. చీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు, బరువు 800 గ్రాములుగా ఉంది. ఈ ప్రత్యేక చీర ధరను రూ.48 వేలుగా నిర్ణయించారు.

చేనేత రంగంలో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తూ సిరిసిల్ల చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని నల్ల విజయ్ కుమార్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu