Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sirikonda: వర్షాల కోసం ఆదివాసీల 'బుడు బమ్ కుకు' సంప్రదాయ వేడుక

Sirikonda: వర్షాల కోసం ఆదివాసీల 'బుడు బమ్ కుకు' సంప్రదాయ వేడుక

hmtv 1 week ago

సిరికొండ: ఆదివాసీల సజీవ సంస్కృతికి, ప్రకృతితో వారికీ ఉన్న అవినాభావ అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గిరిజన గ్రామాల్లో వైశాఖ మాసం (బడ్‌బావై) అమావాస్య సందర్భంగా చిన్నారులు 'బుడు బమ్ కుకు' అనే సాంప్రదాయ ఆటను ఎంతో ఉత్సాహంగా ఆడారు.

​ఈ సందర్భంగా గిరిజన బాలలు కాళ్లకు గజ్జెలు కట్టుకుని, ఒక రోకలిబండకు కప్పను కట్టి భుజాలపై మోస్తూ గ్రామంలో ఊరేగించారు.

ఆ కప్పతల్లికి స్నానం చేయిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పొలిమేరల్లో పూజలు ముగించి ఆ కప్పను సురక్షితంగా వదిలిపెట్టారు. పూజల తర్వాత ఆ కప్ప ఏ దిశగా ప్రయాణిస్తే, ఆ వైపు నుండి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆదివాసీ గిరిజనులు బలంగా నమ్ముతారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సకాలంలో వానలు పడాలని వారు చేసుకునే వినూత్న ప్రార్థన ఇది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu