Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SRH vs PBKS: ఎస్‌ఆర్‌హెచ్‌దే బ్యాటింగ్.. ఉప్పల్ మొత్తం ఆరెంజ్ మయం!

SRH vs PBKS: ఎస్‌ఆర్‌హెచ్‌దే బ్యాటింగ్.. ఉప్పల్ మొత్తం ఆరెంజ్ మయం!

hmtv 2 weeks ago

SRH vs PBKS: ఎస్‌ఆర్‌హెచ్‌దే బ్యాటింగ్.. ఉప్పల్ మొత్తం ఆరెంజ్ మయం!

SRH vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్‌లో పీబీకేఎస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది.

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, గత మ్యాచ్‌లో ఇక్కడ భారీ స్కోర్ చేజ్ చేసిన దృష్ట్యా బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపాడు. జట్టు ప్రస్తుత ఫామ్ బాగుందని, గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు వచ్చినప్పటికీ టాప్‌లో ఉండటం తమకు ప్రేరణగా ఉందని చెప్పాడు. శశాంక్ సింగ్, లూకీ ఫెర్గూసన్‌ ప్లేయింగ్ 11లోకి వచ్చారు.

హైదరాబాద్ కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. తాము కూడా బౌలింగ్ ఎంచుకునే ఆలోచనలో ఉన్నామని, అయితే బ్యాటింగ్‌లో కూడా మంచి ఫలితాలు సాధించినందున ఆందోళన అవసరం లేదన్నాడు. జట్టు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉందని, అభిమానుల మద్దతుతో ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడని కమిన్స్‌ తెలిపాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ సొంత మైదానం కాబట్టి ఉప్పల్ స్టేడియం సహా పరిసరాలు మొత్తం ఆరెంజ్ మయం అయింది. మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ మ్యాచులో గెలిస్తే హైదరాబాద్ పట్టికలో టాప్ లేపుతుంది.

ఈ మ్యాచ్‌కు ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్స్ ఆసక్తికరంగా ఉంది. పంజాబ్ జట్టులో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, కూపర్‌ కానెల్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, మార్కస్ స్టోయినిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్ వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్ పిచ్ సాధారణంగా హై స్కోరింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. ఈ మ్యాచ్‌లో కూడా భారీ పరుగులు వచ్చే అవకాశం ఉంది. అభిమానులు ఉత్కంఠభరితమైన పోరాటం చూసేందుకు సిద్ధంగా ఉన్నారు.

తుది జట్లు:

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ (కీపర్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, సలీల్‌ అరోరా, సమ్రాన్‌ రవిచంద్రన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), శివాంగ్‌ కుమార్‌, ఎషాన్‌ మలింగ, సకీబ్‌ హుస్సేన్‌.

పంజాబ్‌ కింగ్స్‌: ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (కీపర్‌), కూపర్‌ కానెల్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), శశాంక్‌ సింగ్‌, సూర్యాంశ్‌ షెడ్జే, మార్కస్‌ స్టోయినిస్‌, మార్కో యాన్సెన్‌, లూకీ ఫెర్గూసన్‌, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu