Dailyhunt
Sri Sathya Sai: అడవుల్లో పేకాట ఆడుతున్నారా? జాగ్రత్త.. పైనుంచి పోలీసులు చూస్తున్నారు!

Sri Sathya Sai: అడవుల్లో పేకాట ఆడుతున్నారా? జాగ్రత్త.. పైనుంచి పోలీసులు చూస్తున్నారు!

hmtv 6 days ago

Sri Sathya Sai: అడవుల్లో పేకాట ఆడుతున్నారా? జాగ్రత్త.. పైనుంచి పోలీసులు చూస్తున్నారు!

శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు.

ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ చర్యలు అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద, రహదారులపై, ప్రజలు అధికంగా రాకపోకలు జరిపే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నిఘా ద్వారా అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా వంటి అంశాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేకంగా పోలీసులు సులభంగా చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కూడా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తూ చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100/112 నంబర్లకు సమాచారం అందించాలని జిల్లా పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu