Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sri Sathya Sai: బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన!

Sri Sathya Sai: బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన!

hmtv 14 hrs ago

Sri Sathya Sai: బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన!

Sri Sathya Sai: శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో శక్తి యాప్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, బాలికలు వెంటనే సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో తెలియజేశారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లోన్ యాప్స్ మోసాలు, బ్యాంకు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బాల్య వివాహాల దుష్పరిణామాలు, పోక్సో చట్టం (POCSO Act), మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన చర్యల గురించి అవగాహన కల్పించారు.

అదేవిధంగా అత్యవసర సహాయ నంబర్లు 100/112, మహిళల హెల్ప్‌లైన్ 181, అగ్నిమాపక సేవల కోసం 101, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930, బాలల సహాయ నంబర్ 1098 గురించి ప్రజలకు వివరించారు.

గ్రామ ప్రజలు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని శక్తి టీం సూచనలను శ్రద్ధగా విన్నారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంక్షేమం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని శక్తి టీం సభ్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu