Dailyhunt
Srikakulam: రోడ్డు భద్రత ముఖ్యం ఫిట్‌నెస్ లేని బస్సులపై ఎంవీఐ యాక్షన్!

Srikakulam: రోడ్డు భద్రత ముఖ్యం ఫిట్‌నెస్ లేని బస్సులపై ఎంవీఐ యాక్షన్!

hmtv 0 months ago

Srikakulam: రోడ్డు భద్రత ముఖ్యం ఫిట్‌నెస్ లేని బస్సులపై ఎంవీఐ యాక్షన్!

శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మండల కేంద్రంలో పలాస మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాస్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రహదారి భద్రతా నిబంధనల అమలులో భాగంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సులపై ఎం.వి.ఐ శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించారు. బస్సుల పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ మరియు డ్రైవర్ల లైసెన్స్‌లను స్వయంగా పరిశీలించారు. అత్యవసర ద్వారాలు (Emergency Exits) మరియు అగ్నిమాపక పరికరాల లభ్యతను తనిఖీ చేసి, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరించారు. రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ముఖ్యంగా దూరప్రాంత వాహనాలు ఫిట్‌నెస్ మరియు పక్కా పత్రాలతో నడపాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోము అని ఎం.వి.ఐ వై శ్రీనివాస్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu