Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikakulam: సోంపేటలో ఘనంగా వాసుకు పౌర సన్మానం!

Srikakulam: సోంపేటలో ఘనంగా వాసుకు పౌర సన్మానం!

hmtv 1 hr ago

Srikakulam: సోంపేటలో ఘనంగా వాసుకు పౌర సన్మానం!

Srikakulam: మన రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కుటుంబాలకు జర్నలిస్టు వాసు ఆత్మీయ నేస్తంగా మారారని..

ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని ప్రముఖులు పేర్కొన్నారు. సోంపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గురువారం ఆయనకు పౌర సన్మానాన్ని నిర్వహించారు.

ప్రముఖ వాణిజ్య వేత్త జీకే నాయుడు, యువ పారిశ్రామికవేత్త శివకుమార్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలం జగతి కేశపురం గ్రామానికి చెందిన వాసు గడిచిన రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను, గ్రామస్తులు.. ఆహ్వానితులు గుర్తు చేశారు.

ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో గల్ఫ్ దేశాలలో ఉన్న వారి సంక్షేమం కోసం చాలా కృషి చేశారని, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనకు ఉన్నతమైన పదవి కట్టబట్టి తగిన గుర్తింపును, గౌరవాన్ని అందించిందని వ్యాఖ్యానించి ఘనంగా సన్మానం చేశారు.

@ ప్రత్యేక ఆకర్షణగా ఆర్పి @

ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ. పట్నాయక్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ బాబు వివిధ రకాల గొంతులను ఇమిటేట్ చేసి హాజరైన వారి అభినందనలను అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు నటులు ఆర్పి పట్నాయక్ కొన్ని పాటల చరణాలను పాడి ఆదరించారు. వాసు పౌర సన్మాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు.

@ 21 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల కోసం సేవలు @

గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వాసు ప్రైమ్ గత 21 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. వాసు ప్రైమ్‌కు లభించిన ఈ బాధ్యత వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, గల్ఫ్ కార్మికుల కోసం ఆయన రెండు దశాబ్దాలకు పైగా చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా పలువురు అభివర్ణించారు.

కొత్త బాధ్యతల్లో కూడా ఆయన మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రవాసాంధ్రులు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజలు, అభిమానులు పాల్గొని వాసు ప్రైమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu