Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: 19 మంది క్రీడాకారులు.. 31 పతకాలతో తిరుపతి జిల్లాకు కీర్తి!

Srikalahasti: 19 మంది క్రీడాకారులు.. 31 పతకాలతో తిరుపతి జిల్లాకు కీర్తి!

hmtv 19 mins ago

శ్రీకాళహస్తి: నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించిన 46వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాళహస్తికి చెందిన నిత్య ఫిట్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.

తిరుపతి జిల్లా తరఫున బరిలోకి దిగిన 19 మంది అథ్లెట్లు ఏకంగా 31 పతకాలు సాధించి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు.

ఇన్‌స్టిట్యూట్ అధినేతలు జ్యోతిరావు, రూపాదేవి ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు విజయభేరి మోగించారు. 8 మంది మహిళా క్రీడాకారిణులు 20 పతకాలు సాధించగా, 11 మంది పురుష క్రీడాకారులు 11 పతకాలు కైవసం చేసుకున్నారు. పలువురు అథ్లెట్లు రెండు నుంచి మూడు విభాగాల్లో పోటీపడి పతకాలు సాధించడం విశేషం.

ఈ విజయాల్లో ఇన్‌స్టిట్యూట్ అధినేత జ్యోతిరావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రీడాకారులకు కోచ్‌గా శిక్షణ అందించడమే కాకుండా, స్వయంగా పోటీల్లో పాల్గొని పతకం సాధించి తన సత్తా చాటారు. కోచ్‌గా, క్రీడాకారుడిగా ఆయన చూపిన అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు పట్టుదల, క్రమశిక్షణతో 20 పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నిరంతర సాధన, సరైన శిక్షణ ఉంటే ఏ వయస్సులోనైనా క్రీడల్లో అద్భుత విజయాలు సాధించవచ్చని నిత్య ఫిట్‌నెస్ అథ్లెట్లు నిరూపించారు.

ఈ సందర్భంగా పతకాలు సాధించిన మహిళా క్రీడాకారిణులకు ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విజయంతో మరింత మంది మహిళలు, పురుషులు మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu