Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: బీవీపురం, అక్కుర్తిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ప్రారంభం

Srikalahasti: బీవీపురం, అక్కుర్తిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ప్రారంభం

hmtv 56 mins ago

Srikalahasti: బీవీపురం, అక్కుర్తిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ప్రారంభం

శ్రీకాళహస్తి: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరో ముందడుగు పడింది.

ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బి.వి.పురం, అక్కుర్తి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను మంగళవారం ప్రారంభించారు.

తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు ఈ ఆరోగ్య కేంద్రాలను అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ ప్రాథమిక వైద్యం, ఆరోగ్య సేవలు అందించడంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడుతో పాటు నాయకులు దొరై రాజిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్ర, శివ సుదర్శన్ రెడ్డి, సతీష్, రాఘవరెడ్డి, రఘు తదితరులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu