Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

Srikalahasti: ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

hmtv 1 week ago

Srikalahasti: ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

శ్రీకాళహస్తి: ఆన్‌లైన్ ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ సభ్యులు ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల మంది మెడికల్ షాపుల యజమానులు, ఉద్యోగులు జీవనాధారం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అందించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు కూడా ఆన్‌లైన్ ద్వారా నేరుగా వ్యక్తులకు చేరే అవకాశముందని ప్రభుత్వాలను ప్రశ్నించారు. గంజాయి రహిత భారతదేశం లక్ష్యంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆన్‌లైన్ ఫార్మసీలకు అనుమతులు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఆన్‌లైన్ మందుల విక్రయాలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అత్యవసర మందుల కోసం శ్రీకాళహస్తి ప్రజలు మధుసూదన్ రావు - 9985251463, గోపాల్ - 7893266266 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

దేశవ్యాప్తంగా జరుగనున్న బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మన మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి కొండేటి గోపాల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహులు (నంద), మునిరెడ్డి, చక్రపాణి, చిన్నారావు, మహేందర్ రెడ్డి, మోనిష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu