శ్రీకాళహస్తి: 'విశ్వగురు' అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ సరైన విదేశాంగ విధానాలను అనుసరించడంలో వైఫల్యం చెందిన కారణంగానే దేశ ప్రజలు పెట్రోలు, గ్యాస్ కష్టాలు పడుతున్నారని సిపిఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి విమర్శించారు.
పెరిగిన గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యుద్ధం సాకుతో మోడీ ప్రభుత్వం ప్రజలపై పెట్రో భారాలు మోపడం అన్యాయమన్నారు.
మొన్న గృహ అవసరాలపై రూ. 70, వ్యాపారావసరాలపై రూ. 1150 గ్యాస్ భారం మోపిన మోడీ నేడు పెట్రోలు, డీజిల్ పై రూ. 3 పెంచడం దుర్మార్గమన్నారు. అమెరికాకు తలొగ్గి మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఎఫ్ స్టీన్ ఫైల్స్ నుంచి తప్పించుకునేందుకు మోడీ ట్రంప్ చెప్పినట్లు తలూపుతున్నాడని ఆరోపించారు. మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెనగడం గురవయ్య, గురునాధం, రాజా, ఉస్మాన్ బాషా, అన్వర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

