Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti:  పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా ఎమ్మెల్యే

Srikalahasti: పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా ఎమ్మెల్యే

hmtv 4 days ago

Srikalahasti: పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి: పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 22వ తేదీన తన పుట్టినరోజు ఉన్నప్పటికీ, ఈసారి తాను నియోజకవర్గంలో ఉండడం లేదని, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆర్భాటాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు తీసుకువచ్చే గిఫ్ట్‌లు, ఫ్లెక్సీలు, పూలదండలతో డబ్బు వృథా అవుతుందని పేర్కొన్నారు. ఆ డబ్బును పేదవారికి సహాయం చేయడానికి వినియోగించాలని కోరారు. అలాగే దేశ ప్రజలు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మేరకే ఖర్చు చేస్తూ, ధన వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu