Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నామినేషన్ల జోరు!

Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నామినేషన్ల జోరు!

hmtv 25 mins ago

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పలు వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ.. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని, ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం తర్వాత శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమ సుందరం, ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధా యాదవ్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ కుమార్, నాగరాజు, మహేష్, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu