Srikalahasti: శ్రీకాళహస్తి ప్రజా దర్బార్.. సమస్యల పరిష్కారానికి ఆర్డీవో భరోసా!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని ఆర్డీవో కార్యాలయంనందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ప్రజలు ,వారి వారి సమస్యలను ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకుని రాగా సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు.
ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ లో నేడు పలువురు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చారని, సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు, శ్రీకాళహస్తి డివిజన్లో నిన్న జరిగిన చిన్నపాటి గాలులకు శ్రీకాళహస్తి డివిజన్లో ఎక్కడైనా ప్రజలు నష్టపోయి ఉంటే వారి ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఒకటో తేదీ నుంచి జనగణన ఇంటింటి సర్వే కార్యక్రమాలు రెవెన్యూ శాఖ అధికారులు ప్రారంభించారని, ప్రజలు తమ వద్దకు వచ్చే అధికారులకు సహకరించి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసిందిగా కోరారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు.

