Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: శ్రీకాళహస్తి సమీపంలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి!

Srikalahasti: శ్రీకాళహస్తి సమీపంలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి!

hmtv 3 weeks ago

Srikalahasti: శ్రీకాళహస్తి సమీపంలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి!

Srikalahasti: ఈరోజు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో నాయుడుపేట-తిరుపతి జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి సమీపంలోని సింగమల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

విశాఖపట్నం నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీని, అదే దిశలో చిలకలూరిపేట నుంచి తిరుమల దర్శనానికి వెళ్తున్న తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. తుఫాన్ వాహన డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు.

ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉండగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu