Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srisailam: గిరిజన బాలికలకు రక్ష.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

Srisailam: గిరిజన బాలికలకు రక్ష.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

hmtv 2 days ago

Srisailam: గిరిజన బాలికలకు రక్ష.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

Srisailam: శ్రీశైలం ఐటిడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ పి.వి.ఎస్. నాయుడు ఆదేశాల మేరకు, డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DY.DM&HO) డాక్టర్ టి.

రవి మే 21న వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) సబ్ సెంటర్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ అమలుపై సబ్ సెంటర్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి, గ్రామస్తులకు వ్యాక్సిన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ టీకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer)తో పాటు ఇతర సంబంధిత క్యాన్సర్లను నివారించడంలో సురక్షితమైన మరియు అత్యంత ఉపయోగకరమైన టీకాగా పనిచేస్తుందని వివరించారు.

అలాగే అంగ జననేంద్రియ మొటిమలు (Genital Warts) వంటి సమస్యలను కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మొత్తం రెండు డోసులు తీసుకోవాలని, మొదటి డోసు అనంతరం 6 నుండి 12 నెలల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 421 హెచ్‌పీవీ వ్యాక్సిన్లను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు. యర్రగొండపాలెం మండల పరిధిలోని చెంచు గూడెలకు చెందిన అర్హత కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, శ్రీశైలం ఐటిడీఏ ఆధ్వర్యంలో మే 18 నుంచి 25 వరకు నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన ప్రాంతాల్లో "జన్ భాగిదారి - సబ్ సే దూర్, సబ్ సే పహలే" ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (PTG-చెంచు), శ్రీశైలం ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన తెగల (PVTG) సంక్షేమం, అవగాహన కోసం PM JANMAN మరియు DAJGUA పథకాల కింద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu