Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Success Story:నాడు బిస్కేట్లతో కడుపు నింపుకొని...నేడు సినీ ఇండస్ట్రీలో 150 కోట్లు సంపాదించాడు

Success Story:నాడు బిస్కేట్లతో కడుపు నింపుకొని...నేడు సినీ ఇండస్ట్రీలో 150 కోట్లు సంపాదించాడు

hmtv 1 week ago

Success Story: సినీ ప్రపంచం బయటకు కనిపించేంత గొప్పగా ఉండదు. ప్రతి గొప్ప నటుడి వెనుక చెప్పుకోలేన్ని కష్టాలు ఉంటాయి. ఎవరూ ఊహించనటువంటి కన్నీళ్లు ఉంటాయి.

ఆకలి బాధలు ఉంటాయి. వీటన్నింటినీ భరించి ముందుకు సాగితేనే స్టార్‌ హోదా, లగ్జరీ లైఫ్‌, కోట్లల్లో పారితోషికాలు లభిస్తాయి. ఇండస్ట్రీలో చాలా మంది జీవితాలు మొదట్లో ముళ్ల కిరీటాలుగానే ఉంటుంది. స్వయంకృషితో ఎదిగి, పట్టుదలతో ఈ ముళ్ల కిరీటాన్ని వజ్రాల కిరీటంగా మార్చుకున్న గొప్ప నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ. జేబులో కేవలం 2500 రూపాయలతో ముంబైలో అడుగుపెట్టి నేడు 150 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న సిద్ధిఖీ జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం.

రూ.2500 మొదలై నుండి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం వరకు

ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, ఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'లో నటన నేర్చుకున్నారు. యాక్టింగ్ కోర్సు పూర్తి కాగానే ముంబై వెళ్తే వెంటనే అవకాశాలు వచ్చేస్తాయని ఆయన భావించారు. కానీ వాస్తవం చాలా భిన్నంగా ఉంది. ముంబైలో బతకడానికి, రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఆయన ఒకానొక దశలో సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేశారు. డ్రామా స్కూల్‌లో నటన నేర్చుకోవడంతో అవకాశాలు వచ్చినా ఏదో ఒక కారణంతో చేజారిపోతుండేవి. షూటింగ్‌ మొదలయ్యాక మేకర్స్‌ ఆయన్ను రిజక్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇలా అవకాశాలు కోల్పోయిన ప్రతిసారి సర్ధిచెప్పుకునేవాడు. చివరకు అదే ఆయన మానసిక వేదనకు గురిచేసింది. తన దగ్గర తినేందుకు డబ్బులు లేనిసమయంలో కేవలం బిస్కేట్లతోనే కడుపు నింపుకున్నట్టుగా సిద్ధిఖీ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఆ ఒక్క సినిమా'

నవాజుద్దీన్ సిద్దిఖీ కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ఆయన పడిన సుదీర్ఘ పోరాటం అర్థమవుతుంది. అమీర్ ఖాన్ 'సర్ఫరోష్' చిత్రంలో ఒక చిన్న టెర్రరిస్ట్ పాత్రతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్‌ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసినా గుర్తింపు రాలేదు. కానీ, 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన జీవితాన్ని మార్చేసే రోజు వచ్చింది. అదే గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్. ఇందులో సిద్ధిఖీ ఫైజల్‌ అనే పాత్రలో నటించాడు. ఆ పాత్రకు మంచి పేరు రావడమే కాదు ఆయనకు ఏకంగా జాతీయ అవార్డు వచ్చేలా చేసింది. ఇక్కడే ఆయన కెరీర్‌ మలుపు తిరిగింది. తన కెరీర్‌ను మార్చేసిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని పలుమార్లు చెప్పాడు సిద్ధిఖీ.

టైమ్స్ నౌ నివేదిక ప్రకారం, నవాజుద్దీన్ సిద్దిఖీ నేడు బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. రూపాయి లేని స్థాయి నుండి రూ. 150 కోట్ల ఆస్తిని సంపాదించే స్థాయికి ఆయన ఎదిగారు. సినిమా పరిశ్రమలో నెపోటిజం, బ్యాక్‌గ్రౌండ్ వంటి అంశాలపై చర్చ జరుగుతున్న తరుణంలో.. కేవలం ప్రతిభ, సహనం, పట్టుదల ఉంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నవాజుద్దీన్ సిద్దిఖీ జీవితం నిరూపించింది. ఈ స్పూర్తి ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు... ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే పట్టుదల, సహనం ఉండి తీరాలని మనకు తెలియజేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu