Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sullurupeta: పోలీసుల అక్రమ అరెస్టులపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం: శ్రీమంత్ రెడ్డి!

Sullurupeta: పోలీసుల అక్రమ అరెస్టులపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం: శ్రీమంత్ రెడ్డి!

hmtv 1 hr ago

Sullurupeta: పోలీసుల అక్రమ అరెస్టులపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం: శ్రీమంత్ రెడ్డి!

సూళ్ళూరుపేట: ​తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ అయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు, సూళ్ళూరుపేట మున్సిపల్ మాజీ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికల్లో వైసీపి నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పోలీసులు అక్రమ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నెల్లూరులో జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని, నాయుడుపేటలో నియోజకవర్గ ఇంచార్జ్ కిలివేటి సంజీవయ్యను, అలాగే సూళ్ళూరుపేట మండల కన్వీనర్ అనిల్ రెడ్డిలను అన్యాయంగా అరెస్ట్ చేశారని, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమను కూడా పోలీసులు బలవంతంగా ఇంట్లోనే గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, న్యాయ మరియు పోలీస్ వ్యవస్థలు పూర్తిగా దిగజారిపోయి, అధికార టీడీపీ నేతలు ఏం చెప్తే అలా పనిచేసే దుస్థితికి పోలీసులు వచ్చారని ఆరోపించారు.

అధికారంలో ఉండి, అన్ని వ్యవస్థలూ చేతిలో ఉన్నప్పటికీ ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీకి ఎందుకంత భమని నిలదీసిన ఆయన, ధైర్యముంటే నామినేషన్లు వేయించి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థుల వాహనాలపై దాడులు చేయడం వంటి ఘటనలు నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేవని, ఇవన్నీ బీహార్ సంస్కృతిని తలపిస్తున్నాయని విమర్శించారు.

ఈ అక్రమ అరెస్టులను, అడ్డంకులను ఎదుర్కొనేందుకు మరియు నామినేషన్లు వేయించేందుకు గత మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి తగిన ఆదేశాలు తెచ్చుకుని తీరుతామని దబ్బల శ్రీమంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu