Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet: ఆటో డ్రైవర్ దారుణం.. వృద్ధురాలి పుస్తెలతాడు దోపిడీ!

Suryapet: ఆటో డ్రైవర్ దారుణం.. వృద్ధురాలి పుస్తెలతాడు దోపిడీ!

hmtv 4 months ago

Suryapet: ఆటో డ్రైవర్ దారుణం.. వృద్ధురాలి పుస్తెలతాడు దోపిడీ!

Suryapet: సూర్యాపేట టౌన్‌లో మహిళను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బంగారు పుస్తెలతాడు దొంగిలించిన ఆటో డ్రైవర్‌ను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

చోరీకి గురైన 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, నేరానికి ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, 27వ తేదీన చివ్వెంల మండలానికి చెందిన 65 ఏళ్ల ధనలక్ష్మి ఖమ్మం అండర్‌పాస్ వద్ద చివ్వెంల వెళ్లే వాహనం కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఆటో డ్రైవర్ భూతం మహేష్ ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఖమ్మం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పోలీసు చెకింగ్ ఉందని నమ్మబలికి కత్తితో బెదిరించి ఆమె మెడలోని 18 గ్రాముల పుస్తెలతాడు లాక్కుని పరారయ్యాడు.

ఈ ఘటనపై ధనలక్ష్మి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో నెంబర్ AP 24 TC 5480ను గుర్తించి, ఆటో యజమాని ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల భూతం మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు సూర్యాపేట శ్రీనివాస నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు.

విచారణలో మహేష్‌కు తిరుపతమ్మ అనే మహిళతో పరిచయం ఉందని, ఆమెకు డబ్బు అవసరం ఉండటంతోనే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. నిందితుడు దొంగిలించిన బంగారాన్ని తాను ఉంటున్న ఇంట్లో దాచిపెట్టాడు. ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలోని పోలీసు బృందం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతడిని అరెస్ట్ చేసి బంగారం, ఆటో సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసు దర్యాప్తులో బాగా పనిచేసిన ఎస్సై వెంకన్న, సిబ్బంది శ్రీరాములు, రామనర్శయ్య, టెక్నికల్ టీమ్‌ను సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu