Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet: 'పోలీస్ అక్క' షురూ: విద్యార్థినులకు రక్షణగా లేడీ పోలీసులు!

Suryapet: 'పోలీస్ అక్క' షురూ: విద్యార్థినులకు రక్షణగా లేడీ పోలీసులు!

hmtv 1 hr ago

Suryapet: 'పోలీస్ అక్క' షురూ: విద్యార్థినులకు రక్షణగా లేడీ పోలీసులు!

Suryapet: మహిళలు మరియు బాలికలకు భద్రత, భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసు శాఖ వినూత్నంగా ప్రారంభించిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి _పోలీస్ అక్క_లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పి నరసింహ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు ధైర్యం కల్పించడం, పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులకు స్నేహపూర్వక వాతావరణంలో న్యాయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. మహిళలు, విద్యార్థినులు పోలీసులంటే భయపడకుండా, తమ సొంత అక్కతో మాట్లాడినట్లు సమస్యలను పంచుకునేలా చేయడమే లక్ష్యమని అన్నారు.

పోలీస్ అక్కల ప్రధాన బాధ్యతలు:

- ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్‌ను "పోలీస్ అక్క"గా నియమించడం జరిగింది

- పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలను సందర్శించి షీ టీం, భరోసా సెంటర్, సఖీ సెంటర్, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం

- నెలకు ఒకసారి బాలికల హాస్టళ్లలో బస చేసి స్నేహపూర్వక వాతావరణం కల్పించడం

- ఆకతాయిల వేధింపులు, ర్యాగింగ్, బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకోవడం

- బాధితుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతూ కౌన్సెలింగ్ మరియు చట్టపరమైన సహాయం అందించడం

పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా విద్యార్థినులలో ఆత్మస్థైర్యం పెరిగి, ఏ సమస్య ఎదురైనా వెంటనే స్పందించే ధైర్యం వస్తుందని ఎస్పి ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యలు లేదా వేధింపులు ఉంటే డయల్ 100, 112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసు సహాయం పొందవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, మహిళా ఎస్ఐలు మౌనిక, నీలిమ, జాన్సీ రాణి, ఏఎస్ఐలు సైదాని, అరుణా దేవి, కవిత, మహిళా సూపరింటెండెంట్లు సబితా రాణి, శ్రీదేవి మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల _పోలీస్ అక్క_లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu