Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet: సూర్యాపేటలో దారుణం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

Suryapet: సూర్యాపేటలో దారుణం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

hmtv 6 days ago

Suryapet: సూర్యాపేటలో దారుణం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

సూర్యాపేట: జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో భూ వివాదం కారణంగా ఓ వ్యక్తి తన సొంత అక్కను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సురిగి సైదులు తన అక్క సురిగి అంజమ్మ (50)పై ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్తుండగా దారిలో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సైదులుకు తల్లి తన కూతురికి రెండు ఎకరాల భూమి రాసివ్వడంతో కొంతకాలంగా ఆ భూమి తనకే చెందాలని సైదులు అక్క, చెల్లెలిపై తరచూ దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై గతంలో పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ కక్ష పెంచుకున్న సైదులు ఈ హత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనలో సైదులుతో పాటు అతని భార్య, బావమరుదులు, తమ్ముడికి కూడా సంబంధం ఉందని, వారందరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu