Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet: సూర్యాపేటలో కాంగ్రెస్ బలోపేతం.. 'హస్తం' గూటికి బీజేపీ కౌన్సిలర్!

Suryapet: సూర్యాపేటలో కాంగ్రెస్ బలోపేతం.. 'హస్తం' గూటికి బీజేపీ కౌన్సిలర్!

hmtv 1 week ago

Suryapet: సూర్యాపేటలో కాంగ్రెస్ బలోపేతం.. 'హస్తం' గూటికి బీజేపీ కౌన్సిలర్!

సూర్యాపేట: పట్టణ అభివృద్ధిలో కౌన్సిలర్లు పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు.

గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో 19వ వార్డు కౌన్సిలర్ కీర్తి లవన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మూడు రంగుల జెండా కప్పి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ పోతు భాస్కర్ లు మూడు రంగుల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల ప్రజాప్రతినిధు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో భారీగా గా చేరుతున్నారని చెప్పారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సారధ్యంలో సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెదుల్లా పరుగులు పెడుతున్నాయని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని సమస్యలను ఇప్పటికే గుర్తించామని వాటిని పరిష్కరించేందుకు జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డిల సహకారంతో భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

అనంతరం కౌన్సిలర్ కీర్తి లవన్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం అధికార పార్టీతో పాటు మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సారధిలో పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరడం హర్షణీయమని, పార్టీపై నమ్మకం విశ్వాసంతో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దక్షిణ భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తుంది అన్నారు.

కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, కౌన్సిలర్లు చిలుముల సునీల్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, పోల గాని బాలు, గునగంటి హేమా సతీష్, మాజీ కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న, నాయకులు బొప్పని శ్రీకాంత్, 19వ వార్డు నుంచి చేరిన వారిలో నిమ్మల పురుషోత్తం, కోడి వినయ్, సతీష్, పృథ్వి, జలగం రాజు, షేక్ జావీద్, కృష్ణ, నాంపల్లి బాలు, అఖిల్, మోర అజయ్, సాయి, ఎండీ సాజిద్, కె, సందీప్, సతీష్, తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu