Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet: ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఎస్పీ నరసింహ ప్రత్యేక దృష్టి!

Suryapet: ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఎస్పీ నరసింహ ప్రత్యేక దృష్టి!

hmtv 17 mins ago

Suryapet: ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఎస్పీ నరసింహ ప్రత్యేక దృష్టి!

Suryapet: ప్రజల రక్షణ, సురక్షిత ప్రయాణం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఖమ్మం అండర్‌పాస్ వద్ద నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీల నిర్వహణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పట్టణంలోని ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో వాహనదారులు, పాదచారులు సులభంగా ప్రయాణించేలా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. రోడ్లపై అక్రమ ఆక్రమణలను తొలగిస్తూ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే పరిస్థితులను నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాల తనిఖీల సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమించిన వారికి ముందుగా అవగాహన కల్పించి, రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

పట్టణంలోని దుకాణదారులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు తమ వ్యాపార కార్యకలాపాల కోసం రోడ్లను ఆక్రమించవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రహదారులపై వాహనాలు నిలపడం, వస్తువులు ఏర్పాటు చేయడం ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు.

ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా నిరంతరం చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి, ఎస్‌ఐలు గోపి, కృష్ణ, కనకరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu