Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tandur: తాండూరు కంది బోర్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే మనోహర్ విజ్ఞప్తి

Tandur: తాండూరు కంది బోర్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే మనోహర్ విజ్ఞప్తి

hmtv 3 weeks ago

Tandur: తాండూరు కంది బోర్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే మనోహర్ విజ్ఞప్తి

Tandur: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎస్.వి.ఆర్ (SVR) గార్డెన్‌లో నిర్వహించిన రైతు వారోత్సవాలు మరియు ప్రజాపాలన - ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​కీలక అంశాలు:

​తెలంగాణ ఆర్గానిక్ యాప్ ఆవిష్కరణ:

సేంద్రీయ సాగు చేసే రైతులకు సాంకేతిక సాయం అందించే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ ఆర్గానిక్ యాప్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా సేంద్రీయ రైతులకు సాగు మెళకువలు, మార్కెటింగ్ సమాచారం సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

​స్టాళ్ల సందర్శన: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ సాగు ప్రాముఖ్యత స్టాళ్లను, ఉద్యానవన శాఖ ప్రదర్శనలను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని ఆయన సూచించారు.

​తాండూరు కంది బోర్డు ఏర్పాటు కోసం కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేసినారు జి.ఐ (GI) ట్యాగ్ ఉన్న తాండూరు కందికి ప్రత్యేకంగా కంది బోర్డు ఏర్పాటు చేసే అంశంపై కేంద్రం తో మాట్లాడాలని MLA మనోహర్ రెడ్డి తెలిపినారు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఎగుమతి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

​స్థానిక సాగునీటి అవసరాల కోసం కోట్ పల్లి ప్రాజెక్టుకు రూ. 100 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. యాలాల మండలం జుంటి పల్లి గ్రామ సమీపంలో ఆయిల్ ఫామ్ తోటని ఎమ్మెల్యే తో పాటు మంత్రి తుమ్మల సందర్శించి పండిస్తున్న రైతుని అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu