Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tanuku: తణుకు నియోజకవర్గంలో వైభవంగా వైఎస్సార్ జయంతి

Tanuku: తణుకు నియోజకవర్గంలో వైభవంగా వైఎస్సార్ జయంతి

hmtv 2 weeks ago

Tanuku: తణుకు నియోజకవర్గంలో వైభవంగా వైఎస్సార్ జయంతి

Tanuku: మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, తణుకు నియోజకవర్గంలో మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.

వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తణుకు పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజాసేవే మహానేతకు నిజమైన నివాళి అని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

తొలుత కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu