Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tanuku: తెలుగుజాతికి అడుగుజాడ గురజాడ: తణుకులో జయంతి వేడుకలు!

Tanuku: తెలుగుజాతికి అడుగుజాడ గురజాడ: తణుకులో జయంతి వేడుకలు!

hmtv 1 hr ago

Tanuku: తెలుగుజాతికి అడుగుజాడ గురజాడ: తణుకులో జయంతి వేడుకలు!

తణుకు: సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ స్కూల్లో సోమవారం గురజాడ వేంకట అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో వాడుకభాష ఒరవడికి కృషిచేసిన వారిలో ముఖ్యుడు గురజాడ అని అన్నారు.

స్కూల్ డైరెక్టర్ పాతూరి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ అభ్యుదయకవితా పితామహుడు గురజాడ అని కొనియాడారు. విశ్రాంత ప్రిన్సిపాల్ సంకు మనోరమ మాట్లాడుతూ దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి చెందినదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దేశభక్తి గీతాలపై పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సీతారామయ్య చౌదరిని, మనోరమలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమలో ఉపాధ్యాయులు బండి సాయిరమ, వెలుదుర్తి సూర్యబిందు నాగమౌనిక, చిటికిన రాణిరత్నప్రభ, పబ్జాపావని, దెయ్యాల రామలక్ష్మి, సబ్జితి అమృతకుమారి, ముక్కామల మోహనరావు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu